సావిత్రి గారిని ఘోరంగా మోసం చేసిన సత్యం ఎవరో తెలుసా.? ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే.?     2018-05-21   00:12:40  IST  Raghu V

మహానటి మానియా ఇప్పట్లో వదిలేలా లేదు.. ఆమె ఒక నటి అనుకున్నవారికి ఆమె ఒక మహోన్నత శిఖరం అని పరిచయం చేసిన సినిమా..ఆమెది అందరిలాంటి కథే ..సినిమా వాళ్ల కథ అనుకున్న వారికి ఆమెది కథ కాదు చరిత్ర అని పరిచయం చేసిన సినిమా మహానటి..నిజంగా ఆమె కథని కాదు కాదు చరిత్రని అందరికి తెలియచేసిన నాగ్ అశ్విన్ ని ఎంత ప్రశంసించినా తక్కువే.. ఇక సాక్షాత్తూ సావిత్రే తిరిగొచ్చిందా అన్నట్టుగా నటించిన కీర్తికి అర్జంటుగా దిష్టి తీసేయాలి..సావిత్రి గారిని మన కళ్లముందు నిలిపిన కీర్తి నిజంగా ఈ తరం మహానటి..సినిమాకు సంభందించిన ప్రతి ఒక్కరు వారి పనిని వారు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా చేశారు.

ఈ సినిమాలో మహేష్ కూడా ప్రేక్షకుల మైండ్ లో నిలిచే పాత్రను పోషించాడు. మరీ రంగస్థలంలో ఉన్నంత లేకపోయినా మంచి గుర్తింపుని పొందాడు. ఈ సినిమాలో తన పాత్ర పేరు సత్యం. సావిత్రి గారి ఇంట్లో పని చేసేవాడు. చివరికి ఆమెను మోసం చేసాడు. నిజజీవితంలో అసలు సత్యం ఉన్నడా? అసలు ఉంటె ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు అన్న సందేహం కలగక మానదు.