షాక్ లో క్రికెట్ ప్రపంచం , సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటన     2018-05-23   08:52:59  IST  Raghu V

సౌత్ ఆఫ్రికా జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్రికెట్ ప్రేక్షకులకు సడన్ షాక్ ఇచ్చాడు..ఇటీవలే ఆర్ సి బి తరుపున ప్రాతినిధ్యం వవహించి మంచి ఫార్మ్ ని కొనసాగించాడు అయితే తాను అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్న అని ప్రకటించి షాక్ ఇచ్చాడు.34 ఏళ్ల డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా తరుపున 114 టెస్ట్ లు , 228 వన్డే లు , 78 టీ 20 లో ఆడాడు.

రిటైర్మెంట్ ప్రకటన

నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను.114 టెస్ట్ లు 228 వన్డే లు ఆడాను.ఇక యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.నేను చాలా అలసిపోయాను.ఇది చాలా కఠినమైన నిర్ణయమని తెలుసు.చాలా రోజులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.మంచి ఫామ్ లో ఉన్నపుడే తప్పుకోవలనుకున్నాను.ఇండియా ఆస్ట్రేలియా ల పైన సిరీస్ లు గెలిచాక ఇదే చక్కని సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించారు. 14 ఏళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన కోచ్లు , సపోర్టింగ్ టీం కి డివిలియర్స్ కృతజ్ఞత తెలిపాడు.ఇక నా సౌత్ ఆఫ్రికా టీం మేట్స్ కి చాలా థాంక్స్ వాళ్ళ మద్దతు లేకుంటే నేను ఇంత స్థాయికి వచ్చేవాడిని కాదు.నేను చాలా అలసిపోయా,ఇక నా వల్ల కాదు అనిపించింది నా నిర్ణయం అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలు.విదేశాల్లో కౌంటీ లో ఆడే ఉద్దేశం లేదు ,కానీ దేశీయంగా టైటాన్స్ టీమ్ కు మాత్రం ఆడతాను అని తెలిపారు.