శృంగారంలో అతను అక్కడ నొక్కేసరికి...ఊపిరాడక యువతి మృతి.! షాకింగ్ సంఘటన!     2018-07-04   01:50:36  IST  Raghu V

శృంగారం.. ఇద్దరు దంపతుల మధ్య అపూర్వమైన కలయిక. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. శృంగారాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే శృంగారం చేస్తుండగా.. ఓ మహిళ ఊపిరాడక చనిపోయింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే..!

ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఓరియన్ యాకోవ్(23) అనే యువకుడు తన ప్రియురాలి(20)తో గతేడాది విజిటింగ్ వీసాపై భారత్‌కు వచ్చాడు. ముంబైలోని కొలోబా ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో బస చేశారు. యాకోవ్ ఓ రోజు తన ప్రియురాలు ఆపస్మారక స్థితిలో ఉందని హోటల్ సిబ్బందికి తెలిపాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు

ఇక ఈ కేసు విచారణలో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు ఇటీవలే ఓ నివేదిక విడుదల చేశారు. శృంగారం చేస్తున్న సమయంలో ఆమె గొంతుపై గట్టిగా నొక్కడంతోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడించారు. దీంతో ప్రియుడు యాకోవ్‌పై పోలీసులు అభియోగం నమోదు చేశారు.