వైసీపీ నేతలు “అవినీతికి అడ్డాలు”..ఇదేందయ్యా జగనూ     2018-05-18   06:14:35  IST  Bhanu C

ఏపీలో ఉన్న ఇరు పార్టీల అధినేతలకి తమ తమ పార్టీ నేతలతో పెద్ద చిక్కొచ్చి పడింది..ఒక పక్క నీతులు చెప్తూనే మరో పక్క ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు పనులకి సంధానం చెప్పుకోలేక సైలెంట్ అవుతున్నారు ఒక వేళ ఎవరిని ఏమన్నా సరే ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుబాటు చేస్తారోననే భయం ఉండనే ఉంది..అయితే ముఖ్యంగా వైసీపిలో ఈ మధ్యకాలంలో సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యే భాగోతాల వలన పార్టీ పరువు రోజు రోజు కి మరింతగా దిగాజారిపోతోంది..వివరాలలోకి వెళ్తే..

ప్రజల నుంచీ దోపిడీ కొందరు అవినీతి అధికారులు దోపిడీ చేస్తున్న అవినీతి సొమ్ముకి వైసీపి నేతలు కొమ్ము కాస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాము..పోలీసు వర్గాలు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ). క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ మీడియా సాక్షిగా చెప్పిన మాటలు వైసీపి ని ఓ కుదుపు కుదిపేశాయి..ఇదిలాఉంటే..