వైసీపీలో కీల‌క మార్పులు.. మంచికేనా..!     2018-05-22   23:18:01  IST  Bhanu C

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వైసీపీలో కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప‌లు జిల్లాల్లోని అసెంబ్లీ, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రాల కోసమే ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌ధానంగా అభ్య‌ర్థుల ఎంపిక విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత జ‌గ‌న్ ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అయితే కొన్ని అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖరారుకాగా, మ‌రికొన్ని స్థానాల‌కు ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలోనే ఖరారు కావాల్సిన స్థానాల్లో సామాజిక వ‌ర్గాల ప్రాధాన్యాన్ని జ‌గ‌న్ కీల‌కంగా తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి మంచి ప‌ట్టు ఉంది. ఇక్క‌డ కూడా ప‌లు స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖ‌రారు కావాల్సి ఉంది. చిత్తూరు ఎంపీ సీటు, హిందూపురం, కర్నూలు, నంద్యాల వంటి సీట్లలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేస్తార‌న్న విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు. మ‌రికొన్ని స్థానాల‌కు మాత్రం ఇప్పుడే అభ్యర్థులు మారుతున్నారు.