వైసీపీలోకి ఘంటా ..? చేరడం పక్కా .. ఇదిగో లెక్క !     2018-05-16   06:38:32  IST  Bhanu C

రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ నేత ఏ పార్టీ వైపు చూస్తున్నాడో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పుడే తమకు అనుకూలమైన సురక్షితమైన పార్టీలో చోటు కోసం తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు నేతలు.

ఇకపోతే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ జంపింగ్ జిలాన్ల్లో ముందు ఉంటారు. ముందు టీడీపీలో ఉన్న ఘంటా ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ లో చేరి ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనమయ్యి మంత్రి పదవి కూడా పొందారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అనే దశలో టీడీపీలోకి జంప్ చేసిన ఆయన ప్రస్తుతం టీడీపీ లో త్తనకు సరైన ప్రాధాన్యం, దక్కడం లేదని భావిస్తున్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పని అయిపోతుందని అందుకే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నట్టు ఆయన ముఖ్య అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు.

అందుకే ఆయన మంత్రిగా ఉన్నా సరే పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు . దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన మీద అనేక సార్లు అసహనం వ్యక్తం చేసారు. ఘంటా పార్టీ మార్పు పై ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తో ఘంటా రహస్య మంతనాలు సాగించినట్టు సమాచారం. అయితే ఎప్పుడు పార్టీ మారుతారు అనేది మాత్రం ఇంకా బయటకు పొక్కకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. తాజా పరిణామాలు కూడా పరిశీలిస్తే టీడీపీకి రాబోయేది గడ్డుకాలమే అని , తొందరగా పార్టీ మారిపోదామని ఆయన ప్రధాన అనుచరులు కూడా ఆయన మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.