వైరల్ అవుతున్న గ్రహాంతర వాసి వీడియో, అసలు నిజం ఇదే     2018-06-06   01:43:14  IST  Raghu V

ఈ మధ్య కొన్ని సంఘటన ల గురించి ఫేస్బుక్ల్లో , వాట్సాప్ లలో వీడియోస్ , ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు, మనం వాటి గురించి నిజాలు తెలుసుకొకుండా వాటిని షేర్ చేస్తున్నాం , ఇలాంటి ఒక వైరల్ వార్తే ఇటీవల వాట్సాప్ లో వైరల్ అవుతుంది , అదేంటి అంటే కర్ణాటకలో వింతజీవి సంచరిస్తోందని, అది పశువులపై దాడి చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. వింతజీవి దాడిలో గాయపడిన పశువులు మూడు రోజుల్లో చనిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.దీనితో చాలా మంది భయాందోళన చెందుతున్నారు, ఈ సందర్భంగా ‘గ్రహాంతరవాసి’ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.