వీర్య ఉత్పత్తి తగ్గకుండా చేసే స్పెషల్ అండర్ వియర్ ఆవిష్కరణ – ధర చాలా చవక

ఆర్థర్ మేనార్డ్ అనే బ్రిటిష్ బిజినెస్ మెన్ ఓరోజు రాత్రి భోజనం తరువాత డ్రింక్ తాగుతో తన స్నేహితులతో రకరకాల విషయాలపై మాట్లాడుతున్నాడు. అంత పెద్ద బిజినెస్ మెన్ దేని గురించి మాట్లాడుతాడు, ఆర్ధిక వ్యవస్థ గురించి, షేర్స్, డిబెంచర్స్ గురించి మాట్లాడుతున్నాడెమో అని అనుకుంటున్నారేమో, ఆరోజు అతను వృషణాల గురించి మాట్లాడుతున్నాడు. అవును, పురుషుల వృషణాల మీదే చర్చ జరుగుతోంది.

కాని మీరు ఊహించినట్టుగా ఎదో బూతు ముచ్చట జరగట్లేదు. టెక్నాలజీ మనిషిని ఎంతలా బలహీనపరుస్తోంది, స్మార్ట్ ఫోన్, వైఫై వలన తన వృషణాలకి, వీర్య ఉత్పత్తికి ప్రమాదం ఉందని తెలిసినా, స్మార్ట్ ఫోన్ ని ఇంటర్నెట్ ని పక్కనపెట్టలేకపోతున్నాడు అని చర్చ మొదలుపెట్టాడు ఆర్థర్. ఈ కాలంలో ఇంటర్నెట్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా బ్రతకడం చాలా కష్టం. కాబట్టి వాటి నుంచి వృషణాలను రక్షించే మార్గం కనుక్కోవాలి అని అఆలోచిస్తున్న ఆర్థర్ కి ఒక వెరైటి ఆలోచన తట్టింది. వృషణాలని రేడియేషన్ తరంగాల నుంచి రక్షించే ఎలక్ట్రానిక్ పరికరం కొత్తగా తోడుక్కోవడం జరగని పని, మరి ఆ తరంగాలను ఆపగలిగే అండర్ వియర్ తయారు చేస్తే ఎలా అని ఓ ఆలోచన వెలిగింది అతని మెదడులో. బ్రిలియంట్ ఐడియా అంటూ చప్పట్లు కొట్టారు స్నేహితులు. ఆలోచన రావడమే ఆలస్యం, ఆ సరికొత్త అండర్ వియర్ రూపకల్పనలో బిజీ అయిపోయాడు.