వినాయకుని గురించి ఈ విషయాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

మనం ఏ పని చేయాలన్న వినాయకుణ్ణి పూజించి తర్వాతే చేస్తూ ఉంటాం. అలాంటి వినాయకుని గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం.

శివ పురాణం ప్రకారం వినాయకుని నిజమైన రంగు ఎరుపు మరియు పసుపు.

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒక రోజు వినాయకుడు ధ్యానంలో ఉండగా తులసి దేవి చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోమని కోరింది. అయితే వినాయకుడు నిరాకరించటంతో తులసి దేవి కోపంతో నీకు ఎప్పటికి పెళ్లి కాదని శపించిందట. దాంతో వినాయకుడు కూడా తులసి దేవిని మొక్కగా మారమని శపించాడు. అప్పటి నుండి తులసి మొక్కగా అందరి చేత పూజలు అందుకుంటూ ఉన్నది తులసీదేవి

వినాయకుడు,విగ్నేశ్వరుడు,ఏకదంతుడు,గణపతి,లంబోదరుడు ఇలా వినాయకుడికి 108 పేర్లు ఉన్నాయట.

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం వినాయకుణ్ణి మొత్తం దేవతలందరూ దీవిస్తూ ఉండగా శనీశ్వరుడు మాత్రం తల దించుకొని ఉండటం గమనించిన పార్వతి కారణం ఏమిటని అడగగా నేను వినాయకుణ్ణి చూస్తే తల తెగుతుందని చెప్పుతాడు శనీశ్వరుడు. అప్పుడు పార్వతి ఆలా ఏమి జరగదు అని చెప్పి శనీశ్వరుణ్ణి వినాయకుణ్ణి చూడమని చెప్పుతుంది. శని దేవుడు వినాయకుణ్ణి చూడగానే వినాయకుని తల తెగి కింద పడిపోయిందట.