విటమిన్ E ఆయిల్ జుట్టుకు ఎంత మాయ చేస్తుందో తెలుసా?     2018-05-17   22:23:49  IST  Lakshmi P

ప్రతి మహిళ అందమైన,ఒత్తైన,పొడవైన జుట్టు కావాలని కోరుకోవటం సహజమే. అయితే ఆలా జుట్టు ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జుట్టు సంరక్షణకు విటమిన్ E చాలా సహాయపడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే జుట్టుకు చాలా బాగా ఉపయోగపడే పదార్ధాలలో ముందు ఉంటుంది. విటమిన్ E ఆయిల్ జుట్టుకు మృదుత్వాన్ని,మెరుపును కలిగిస్తుంది. ఇప్పుడు విటమిన్ E ఆయిల్ ని ఎలా ఉపయోగిస్తే జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

విటమిన్ E ఆయిల్ జుట్టుకు ఎంత మాయ చేస్తుందో తెలుసా?

ఒక బౌల్ లో రెండు విటమిన్ E క్యాప్సూల్ నుంచి నూనెను తీసుకోని దానిలో బాదం ఆయిల్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఏర్పడుతుంది.