వర్మను తన్నాల్సి వస్తుందా?     2018-05-29   00:48:29  IST  Raghu V

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనాత్మకంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత పుష్కర కాలంగా వర్మకు సరైన సక్సెస్‌ లేదు. అయినా కూడా వర్మను నమ్మి ఎంతో మంది సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. శ్రద్ద పెట్టి వర్మ సినిమా తీస్తే ఖచ్చితంగా అద్బుతాలు ఆవిష్కారం అవుతాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో అద్బుతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వర్మ తాజాగా నాగార్జున హీరోగా ‘ఆఫీసర్‌’ అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం కథ చెప్పినప్పుడు నాగార్జునతో వర్మ చెప్పిన మాట ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

నాగ్‌తో వర్మ చెప్పిన ఆ మాట ‘ఆఫీసర్‌’ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. తాజాగా ‘ఆఫీసర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ ‘ఆఫీసర్‌’ చిత్రం ఒక మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. తప్పకుండా ఈ సినిమా శివ రేంజ్‌లో ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ చిత్రం కథ చెప్పే సమయంలో వర్మ తనతో ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటీ అంటే తాను చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించకుంటే తన్నండి పడతాను అన్నాడు. కాని సినిమాను వర్మ ఎలా అయితే నరేట్‌ చేశాడో అలాగే తెరకెక్కించాడు. అందుకే ఇప్పుడు వర్మను నేను తన్నడం లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.