లోకేష్ విషయంలో పక్కా ఆధారాలు..వాళ్లందరూ టచ్ లో ఉన్నారు..జనసేన షాకింగ్ స్టేట్మెంట్    2018-03-22   01:10:19  IST 

ఇన్నాళ్ళు జనసేన పార్టీలో తెరపై కనిపిస్తూ వస్తోంది పవన్ ఒక్కడే..ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో చేస్తున్నారు అంటూ పవన్ ప్రత్యర్ధుల నుంచీ బయట ప్రజల వరకూ ఎంతో మంది విమర్శలు చేశారు..అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలకి స్వస్తి పలికారు నిన్న జనసేన పార్టీ కీలక సభ్యులు అందరు కలిసి ప్రెస్ మీట్ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు..అంతేకాదు వస్తూనే పెద్ద బాంబు పేల్చారు..లోకేష్ అవినీతిపై పక్కా ఆధారాలు ఉన్నాయని తేల్చి చెప్పారు..అంతేకాదు అనేక సంచలన ఆరోపణలు చేశారు…వివరాలలోకి వెళ్తే..

గుంటూరు సభలో లోకేష్ చేస్తున్న అవినీతి మీ కంటికి కనపడదా అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని విమర్శించారు…ఆరోజు నుంచీ మొదలు ఈరోజు వరకూ కూడా ఏపీ టిడిపి నేతలు జనసేన పవన్ కళ్యాణ్ పై తీవ్రమైనవ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకి బదులుగా జనసేన నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు..మంత్రి లోకేష్ అవితికి పాల్పడుతున్నారని, సరిదిద్దుకోవాలని చెబితే.. పవన్ కల్యాణ్ పై విమర్శలు దిగడం టీడీపీ నేతలకు తగదని జనసేన ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ పాల్పడుతున్న అవినీతికి సంబంధించి అన్నీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా మీడియా ముందు తెలిపారు..

పక్కా ఆధారాలు మా వద్ద ఉన్నాయని జనసేన నేతలు చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు మరింత ఇరకాటంలో పడ్డారు..అవసరమైన సమయంలో అన్ని విషయాలు బయటకి వస్తాయని అన్నారు…మీతో 40 మంది టచ్ లో ఉన్నరన్న విషయం మీడియా ప్రతినిధి ప్రస్తావించగా..అవును నిజమే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..వారి పుత్రులు ఉన్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు మాత్రమె కాదు ఎంపీలు కూడా ఉన్నారని అన్నారు..అయితే ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన కలకలం రేపుతోంది..అయితే వాళ్ళు ఎవరు ఏ ఏ నియోజకవర్గాలకి సంభందించిన వాళ్ళో సీఎం కి తెలుసు అని అన్నారు..సీఎం ఇంటిలిజెన్స్ ఇప్పటికే అన్ని విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఉంటుంది అని అన్నారు..అయితే వారు ప్రకటించిన 40 ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్ఖంట ఏర్పడింది.