“లక్ష డాలర్లు” గెలుచుకున్న “భారత ఎన్నారై” ..     2018-04-21   23:13:01  IST  Bhanu C

భారతీయులు ఏ దేశంలో ఉన్నా సరే తమ తమ ప్రతిభా పాటవాలు చక్కగా ప్రదర్శిస్తారు అనడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి..ఎంతో మంది భారతీయులు ఎంతో చక్కని ప్రతిభని కనబర్చుతూ రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు…అయితే తాజాగా అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక యువకుడు ఏకంగా లక్ష డాలర్ల బహుమతిని గెల్చుకున్నాడు..అసలు ఏమిటా రికార్డు..ఎందుకు లక్ష డాలర్లు..ఏమిటా విశేషం అనే వివరాలలోకి వెళ్తే..

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా నిర్వహించే పోటీ పరీక్షల్లో అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడు లక్ష డాలర్ల బహుమతి గెలుచుకున్నాడు…జియోపార్డీ కళాశాలలో జరిగిన క్విజ్‌ పోటీలో ధ్రువ్‌ గౌర్‌ అనే యువకుడు ఈ బహుమతి మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ధ్రువ్‌ ఐవీ లీగ్‌ బ్రౌన్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అమెరికాలో ఈ క్విజ్‌ చాలా పాపులర్‌. దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతుంది.