రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయేముందు అతను తన తల్లికి పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లే.!     2018-06-02   02:23:45  IST  Raghu V

రోడ్డు ప్రమాదంలో చనిపోయే ముందు ఓ వ్యక్తి తన భావాలను రాస్తే ఇలా ఉంటుందంటూ రాసిన ఉత్తరం ఇది. హృదయాన్ని కదిలించింది. దీన్ని చదివాక ఎవరైనా మారితే ఆ క్రెడిట్ మాత్రం ఈ పోస్ట్ ను రాసిన వారికే దక్కుతుంది.

అమ్మా ! … నేనొక పార్టీకి వెళ్ళాను …

నువ్వు చెప్పిన మాటను గుర్తుంచుకున్నాను …
నన్ను త్రాగమని అందరూ ప్రోత్సహించినా నేను మద్యం పుచ్చుకోలేదు, సోడా త్రాగాను …
నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది.
నువ్వెప్పుడూ నా మంచి కోరే చెప్తావు. . .
నాకు తెలుసు ఇతరులు “పరవాలేదులే, త్రాగినా డ్రైవ్ చెయ్యొచ్చు అని చెప్పినా, నువ్వు చెప్పినట్లే నేను మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యలేదు, పార్టీ అయిపోయింది.
త్రాగిన వారందరూ కార్లలో ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు …
నేనూ నా బండి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాను.
ఆ రెండో కారు నన్ను గమనించలేదు …

“ ఢాం ” అని నన్ను డీ కొట్టింది ….
డివైడర్ మీద నేను పడి ఉన్నాను.
పోలీసులు వచ్చారు …
ఆ రెండో డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు !
ఆంబులెన్స్ వచ్చింది …
నేను కొద్దిసేపట్లో మరణిస్తానని వారన్నారు !