రోజుకి 3 లవంగాలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు     2018-03-14   01:05:39  IST  Lakshmi P

మనం సాధారణంగా లవంగాలను వంటల్లో వాడుతూ ఉంటాం. అలాగే లవంగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, మాంగనీస్, విటమిన్ A,C లు సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజు మూడు లవంగాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి గ్యాస్,అసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.

లవంగం మొగ్గలో యాంటీ బాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.

మధుమేహం (డయాబెటిస్) సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు లవంగాలను తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబ్దదీకరిస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.