రేణుదేశాయ్‌ పదే పదే చెప్పడం ఎందుకు?     2018-06-29   05:29:30  IST  Raghu V

రేణుదేశాయ్‌ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. ఈమె ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం తెల్సిందే. రేణుదేశాయ్‌కి మొదటి భర్త పవన్‌ కళ్యాణ్‌ ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా అందరికి విధితమే. కొడుకు అకీరాకు తల్లి రేణుదేశాయ్‌ వివాహం చేసుకోవడం సుతారం ఇష్టం లేదని, తల్లి పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే తండ్రి వద్దకు వెళ్లి పోయాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. తల్లి వివాహ సమయంలో అతడు ఆమె వద్ద ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తపై రేణుదేశాయ్‌ స్పందించింది.

తన కొడుకుకు నేను వివాహం చేసుకోవడం ఇష్టం లేదంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, అతడితో మాట్లాడిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గతంలో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి కూడా అకీరాకు తాను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటూ చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో పదే పదే నెటిజన్స్‌ ఆమెను ఈ విషయమై ప్రశ్నించగా, ఆమె మళ్లీ మళ్లీ సమాధానం చెప్పడం చేస్తుంది. దాంతో ఇప్పుడు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఒక అబద్దంను నిజం చేయాలని రేణుదేశాయ్‌ చూస్తుందా అంటూ కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.