రెడ్ మీ ఫోన్ రూ.1 కే కోనేయ్యండి ఇలా

భారతీయ మొబైల్ మార్కెట్ లో రెండోవ అతిపెద్ద కంపెని అయిన షియోమి ఎప్పట్టికప్పుడు ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ ని మార్కెట్ లోకి దింపడమే కాదు, మంచి మంచి ఆఫర్స్ ని అందిస్తూ రోజు రోజుకి మార్కెట్ స్థాయిని పెంచుకుంటోంది. గత ఏడాది ఇదే దసరా – దీపావలి సమయంలో రూ1 కే కొన్ని లిమిటెడ్ స్మార్ట్ ఫోన్స్ ని అందించి వినియోగదారులని విపరీతంగా ఆకట్టుకున్న షియోమీ, ఈ ఏడాది కూడా అలాంటి ఆఫర్ నే పట్టుకొచ్చింది. దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా, రూ.1 స్మార్ట్ ఫోన్ సేల్స్ ని మళ్ళీ ఓపెన్ చేస్తోంది. ఈ స్పెషల్ సేల్స్ ఎప్పుడు ఉన్నాయో, ఎలా పార్టిసిపేట్ చేయాలి వివరాలు చూడండి.

దివాలి విత్ ఏంఐ సేల్స్ సెప్టెంబర్ 27 నుంచి సెప్టెంబర్ 29 వరకు జరుగుతాయి. ఈ సేల్స్ ఇటు mi స్టోర్ యాప్ లో, అటు mi.com లో నిర్వహిస్తారు. ఈ మూడురోజులు ఉదయం 10 గంటలకు కూపన్స్ ఇస్తారు. ఈ కూపన్స్ ని మీరు యాప్ లో ఉండే, దియా గేమ్ లో పార్టిసిపేట్ చేసి పొందవచ్చు. కూపన్స్ వలన మీరు mi స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికారాలపై మంచి డిస్కౌంట్ పొందగలరు.