రావి ఉసిరితో ఎన్నో ప్రయోజనాలు

ఉసిరి రసంలో బెల్లం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గటంతోపాటు రక్తస్రావం, మంటలు, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

ఉసిరి పొడికి ,వేపాకు పొడిని కలిపి ప్రతీరోజు ఉదయం పూట తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలికంగా ఉండే చర్మ వ్యాధులు సైతం తగ్గిపోతాయి. అలాగే ఉసిరి రసాన్ని 150 మిల్లి లీటర్ల మోతాదుని తేనెతో కలిపి తీసుకుంటే మూత్ర సంభందిత వ్యాదులు తొలిగిపోతాయి.

తెల్ల మచ్చలు తగ్గడానికి ఉసిరి పెచ్చులు ,చండ్ర చెక్కలని నీళ్ళకి కలిపి కషాయం చేసి బావంచాలు గింజల పొడిని తీసుకుంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి.

ఉసిరిపండ్ల పెచ్చులను, ఇప్పపువ్వులను (మధూకం) నీళ్లకు కలిపి మరిగించి, తేనె కలిపి బాగా పుక్కిట పడితే నోటిలోనూ, గొంతులోనూ తయారైన పూత, నోటి పుండ్లు తగ్గుతాయి

లేత ఉసిరి కాయల్ని ,గోమూత్రంలో వారం పాటు నానబెట్టి,మేకపాలు కలిపి మెత్తని పేస్టూ లా నూరుకొని మొఖం మీద అద్దుకుంటే మంగు మచ్చలు తగ్గుతాయి.