రావి ఉసిరితో ఎన్నో ప్రయోజనాలు  

ఉసిరి కాయ దీనిని రావి ఉసిరి అని కూడా అంటారు.ఇవి అడువులలో సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి.వీటిని మన పూర్వీకులు ఎప్పటినుంచో ఆయుర్వేద మందులా వాడుతున్నారు.ఆయుర్వేదంలో ఉసిరికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ,ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్నా సౌందర్య సాధనాల మీద లేక జుట్టుకి సంభందిత ఉత్పత్తులమీద ఈ ఉసిరి తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఉసిరి వలన అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో మీరు కూడా చూసి పాటించండి.

ఉసిరి పెచ్చుల పొడి,పిల్లపీచర గడ్డాల పొడి ,పంచదార ,తేనె వీటన్నిటినీ సమానా భాగాలుగా కలిపి నెయ్యి లేదా పాలు తో కలిపి తీసుకుంటే వృద్ధాప్యం లో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.కంటి చూపు మెరుగు పడుతుంది.

ఉసిరి పండ్ల రసాన్ని ద్రాక్ష పండ్ల రసాన్ని ,పంచదార కలిపి తింటే కడుపు నొప్పి తగ్గుతుంది.అంతేకాదు ఉసిరి రసాన్ని నీళ్ళలో కలిపి మూడు రోజులు తీసుకోవడం వలన కూడా ఈ కడుపు నొప్పిని తగ్గించవచ్చు.