రాజకీయం అంటే ఇదే బాబు ! శృతిమించిన మోత్కుపల్లి లొల్లి !     2018-06-05   03:59:38  IST  Bhanu C

రాజకీయం ఎలా ఎప్పుడు మారుతుందో చెప్పలేం. నిన్నటివరకు కావలించుకుని తిరిగినవారు నేడు కత్తులు దూసుకునే పరిస్థితి రావచ్చు. ఇదే నిరూపిస్తున్నారు తెలంగాణ లో టీడీపీ ముఖ్యనేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కు తాను కవచం అంటూ ప్రచారం చేసుకున్న సీనియార్ టిడిపి నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు మీద గట్టిగానే విరుచుకుపడ్డారు.

బాబు పెద్ద మోసగాడని, ఎలా ప్రజలను వంచిస్తాడు..ఆయన అవినీతికి ఎలా పాల్పడాతారు..ఇలా అనేక విషయాలపై మోత్కుపల్లి తన స్వరం పెంచి మాట్లాడుతుంటే మహానాడులో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి బాబు మీద ఆరోపణలు చేస్తుంటే వాటికి ధైర్యంగా సమాధానం చెప్పే స్థితిలో టీడీపీ నాయకులు ఎవరూ లేకుండాపోయారు.