రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా... అయితే ఈ ఆహారాలు మీ కోసమే     2018-04-20   23:22:38  IST  Lakshmi P

మన శరీరంలో సరిపడా రక్తం లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అలాగే శరీరంలో తగినంత ఐరన్ లేకపోవటం మరియు విటమిన్స్ లోపం కారణంగా కూడా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలో మన దేశంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ సమస్య అధికంగా స్త్రీలలో కనపడుతుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన చిన్న పిల్లలలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అయితే మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర‌, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.

అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల‌లో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని కూడా ప్రతి రోజు తీసుకోవాలి.