రక్తపోటు తగ్గించే సూపర్ ఆహారాలు

మారుతున్న జీవనశైలి,ఉప్పు,కారాలు ఎక్కువగా తినటం,మసాలా పదార్ధాలు ఎక్కువగా తినటం,మానసిక ఒత్తిడి,సరైన పోషకాహారం తీసుకోకపోవటం,వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో రక్తపోటు వస్తుంది. అయితే కొన్ని ఆహారాలను తీసుకుంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

డార్క్ చాకోలెట్ లో పాలీ ఫినాల్స్, ఫ్లెవనాయిడ్స్, క్యాథెచిన్స్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్త సరఫరాను మెరుగుపరచి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటును తగ్గించటమే కాకుండా రక్త సరఫరాకు ఎటువంటి అంటంకాలు లేకుండా చేయటంలో సహాయపడుతుంది.

రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని త్రాగితే శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది. శరీరం హైడ్రేడ్ గా ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా నీటిని త్రాగాలి.