యువకుడిని బలి తీసుకున్న అందం..     2018-06-04   03:19:35  IST  Raghu V

అందం అనేది మనిషి మనసుకి ఉండాలి తప్ప శరీరానికి కాదు అనే విషయం చాలా మందికి తెలియదు ముఖ్యంగా యువతీ యువకులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే..తాము అందంగా లేమనే ఉద్దేశ్యంతో ఎంతో మంది డిప్రషన్ లోకి వెళ్ళిపోవడం తమలో తామే కుమిలిపోవడం శాడిస్ట్ లా తయారయ్యి పోవడం చివరికి అందంగా ఉన్న వారిపై దాడులు చేయడం లేదా వారు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది రోజుకి ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం అయితే.

తాజాగా జరిగిన ఘటన ఇందుకు నిదర్సనం గా నిలిచింది ఒక యువకుడు తాను అందంగా లేనంటు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తన సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు ఈ సంఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపుతోంది..సాలూరు మండలం కోదుకరకవలసకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అందంగా లేనంటూ కుమిలి పోతున్న అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.