మోడీ కాచుకో..సవాల్ విసురుతున్న ఏపీ ప్రభుత్వం     2018-06-06   01:53:22  IST  Bhanu C

నిన్నా మొన్నటి వరకూ ఏపీ అంటే చులకన చూపు చూసిన కేంద్రం..తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈ సారి ఏపీ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది అంటూ తెలుగుదేశం నేతలు తెగ సంబర పడుతున్నారు.. ఇప్పుడు కేంద్రం జుట్టు ఏపీ చేతిలో ఉంది ఏపీ పై ఒంటి కాలిపై ఎగిరిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు రండి బయటకి అంటూ సవాళ్లు విసురుతున్నారు..అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ కూడా బీజేపి నేతలు స్పందించక పవడం పలు అనుమానాలకి తావిస్తోంది..అసలు కేంద్రం జుట్టు ఏపీ చేతిలో ఉండటం ఏమిటి..? అసలేమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే..

కేంద్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం తాలూకు ఆధారాలు ఏపీ చేతికి చిక్కాయట..అయితే ఈ కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడుతామని ఏపీ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసింది..ఈ ప్రకటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది..బిజెపి నేతలకి గుండెల్లో రైళ్ళు పరిగెట్టడం మొదలయ్యింది..అయితే ఈ స్కాము చాలా భారీ స్థాయిలో ఉందని త్వరలోనే అన్ని ఆధారాలతో సహా బయట పెడుతామని ఏపీ ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు…మీడియాతో మాట్లాడిన సందర్భంలో తెలిపారు..