మొదటిసారి మద్యం తాగి, అందరికి ముద్దులు పెట్టిన హీరోయిన్

మన దేశంలో మద్యం అంటే కేవలం మగవారు మాత్రమే తాగాలి, తాగుతారు అనే దృష్టితో చూస్తారు. కాని వెస్ట్రన్ దేశాల్లో అలా కాదుగా. అసలు బయటి దేశాలు ఎందుకు, బడాబాబుల ఇళ్ళలో అమ్మాయిలు మద్యం సేవించడం అనేది చాలా కామన్ విషయం. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది అత్యంత కామన్ విషయం. అందరు అని చెప్పలేము కాని, దాదాపుగా అందరు హీరోయిన్లు మద్యం సేవిస్తారు. రోజంతా పనిచేసేవారికి రాత్రిపూట ఆ రిలీఫ్ ఉండాలి కదా. అలాగే సినిమా ఇండస్ట్రీ అంటే పరిచయాలు పార్టీల్లోనే పెరుగుతాయి. ఆ పరిచయాల కోసమైనా మద్యం అలవాటు చేసుకుంటారు.

బాలివుడ్ భామ పరిణీతి చోప్రాకి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మద్యం అలవాటు లేదట. అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత కూడా ఓ అయిదారు సినిమాలు చేసేదాకా అసలు ఈ హీరోయిన్ మద్యం జోలికే వెళ్ళలేదట. ఇప్పుడైతే పరిణీతి మద్యాన్ని హ్యాంగ్ అవుట్స్ లో తాగుతోందట. ఇక తొలిసారి మద్యం తాగినప్పుడు, తొలిసారి మత్తులో మునిగినప్పుడు వెరైటి పనులు చేసానని, తన మీద తనకు కంట్రోల్ లేని తరుణంలో కూడా బాగా ఎంజాయ్ చేసానని, రాత్రంతా డ్యాన్స్ చేసి అందరికి ముద్దులు కూడా పెట్టానని పరినీతి తన మద్యం గ్నాపకాల్ని బయటపెట్టింది.

“నేను, ఆలియా (భట్), వరుణ్ ధావన్ ఇంకా ఆదిత్య రాయ్ కపూర్ కలిసి డ్రీమ్ టూర్ కి వెళ్లాం.ఆ ప్రోగ్రాం ముగిసిపోగానే అందరం కలిసి ఒక నైట్ క్లబ్ కి వెళ్లాం. ఆ ముగ్గురికి తాగే అలవాటు ఉంది. నేనేమో అప్పటివరకు మందు చుక్క రుచి చూసింది లేదు. బాగా బలవంతం చేసారు. దాంతో ఒక జాగర్ బాంబ్ డ్రింక్ తీసుకున్నాను. బాగుండటంతో మరోటి తీసుకున్నాను. అంతే తాగేసాను. మొదటిసారి మత్తులో మునగటం వలనేమో, ఉదయం 6 గంటలకి నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేసాను. మధ్యమధ్యలో అందరికి ముద్దులు కూడా పెట్టాను. చాలా సరదాగా అనిపించింది. నిద్ర కూడా బాగా పట్టింది. ఆరకంగా నా జీవితంలో మద్యపానం మొదలైంది” అంటూ ఆ సరదా సంఘటన గురించి చెప్పుకోచ్చింది ఈ హాట్ హీరోయిన్.