మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే...బెస్ట్ టిప్స్     2018-06-03   23:45:58  IST  Lakshmi P

ఎంతో కస్టపడి మేకప్ వేసుకుంటూ ఉంటాం. ఆ మేకప్ ఎక్కువసేపు లేకపోతే ముఖం అందవిహీనంగా కనపడుతుంది. ముఖం మీద మేకప్ ఎక్కువసేపు ఉండకపోవటానికి చర్మ తత్త్వం, కాలుష్యం,కొన్ని రకాల కాస్మొటిక్స్ వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

మేకప్ వేసుకోవటానికి ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖం మీద మలినాలు తొలగిపోయి మేకప్ ఎక్కువసేపు నిలుస్తుంది.

మాయిశ్చరైజ్ రాయటం అనేది మేకప్ ఎక్కువగా నిలవటానికి పునాదిలా ఉంటుంది. మాయిశ్చరైజ్ రాయటం వలన ముఖ చర్మం పొడి పొడిగా లేకుండా ఉంటుంది.