మెగా హీరో సినిమాను గుర్తు చేస్తున్న విశాల్‌     2018-05-31   02:54:35  IST  Raghu V

విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘అభిమన్యుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తమిళంలో ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అభిమన్యుడు తెలుగులో కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. సమంత హీరోయిన్‌గా నటించడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ట్రైలర్‌ చూస్తుంటే ఇటీవలే విడుదలైన మెగా మూవీ ‘నా పేరు సూర్య’ను మళ్లీ చూస్తున్నట్లుగానే ఉంది. నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్‌ కూడా ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం తెల్సిందే. ఆర్మీ ఆఫీసర్‌ అయిన సూర్యకు కోపం ఎక్కువ. ఆ కోపం కారణంగానే పలు ఇబ్బందులు ఎదుర్కొంటాడు.

అచ్చు ‘అభిమన్యుడు’ చిత్రంలో కూడా నా పేరు సూర్య చిత్రంలో మాదిరిగానే ఆర్మీ ఆఫీసర్‌ అయిన విశాల్‌ అధిక కోపంతో ఉంటాడు. ఆ కోపం వల్ల ఆర్మీలో ఉన్న అతడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇలా సేమ్‌ టు సేమ్‌ కథ ఉన్న సినిమా కొన్ని వారాల గ్యాప్‌లో రావడం అరుదు. ఇలా జరగడం కాకతాళియం కావచ్చు, కాని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరిస్తారని భావించడం అవివేకం అవుతుందని ట్రేడ్‌ పండితులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో విశాల్‌కు మంచి మార్కెట్‌ ఉంది. కాని ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబడుతుందనే నమ్మకం మాత్రం లేదు.