మెగాస్టార్ బర్త్ డే .. మరో హీరో తరం కాని రికార్డుల లిస్టు చూడండి

కొణిదెల శివశంకర వరప్రసాద్. ఒకప్పుడు ఒక అనామకుడు. మరి ఇప్పుడు? మెగాస్టార్ చిరంజీవి. ఎందరో అనామకులకి స్ఫూర్తి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఎవరు గ్రాండ్ ఫాదర్ కాదు. ఎంట్రీ ఇచ్చిన సమయానికి ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ లాంటి ఉద్దండులు ఉన్నారు ఇండస్ట్రీలో. ఆ సమయంలో మరి ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పీక్స్ లో ఉన్నారు. ఆ మాస్ ప్రభాజనాన్ని తట్టుకొని నిలబడటం మాత్రమే కాదు, అంతకుమించి ఎదిగిపోయారు మెగాస్టార్. చిరంజీవి అనే పేరు వినగానే మనకు కోట్లాదిమంది అభిమానుల కోలాహలం, రికార్డులు గుర్తుకు వస్తాయి కాని, వీటికి మించి చిరంజీవి అంటే ఒక గొప్ప నటుడు.

గ్యాంగ్ లీడర్, ఖైదీ, ఇంద్ర లాంటి సినిమాలే మనకు మొదట గుర్తుకురావొచ్చు, కాని ఒక ఆపద్బాంధవుడు, ఒక స్వయం కృషి, ఒక అభిలాష తీసింది కూడా ఆయనే. అందుకే చిరంజీవి స్థానం ప్రత్యేకం. మెగా స్టార్ అయినా, ఓ గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అభినయంతో కూడా మెప్పించే అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. పదేళ్ళు గ్యాప్ వస్తే మరో హీరో అయితే మినిమం ఓపెనింగ్స్ రాబట్టడం కూడా కష్టం. కాని బాహుబలికి మించిన ఓపెనింగ్స్ రాబట్టి ఈ తరం హీరోల రికార్డులు అన్ని గాలి ఉదేసినట్టు ఉదేసారు మెగాస్టార్. ఆ నెం.1 హీరో పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా, ఆయన కెరీర్ లోని కొన్ని అద్భుతమైన రికార్డులు ఇవిగో.