మీ జుట్టు రాలుతుందా? పురుషుల్లో జుట్టు రాలటానికి ముఖ్య కారణాలు ఇవే     2018-05-27   01:23:25  IST  Lakshmi P

జుట్టు రాలడం యువకుల్లో ఎక్కువగా కనిపించే లక్షణం , రోజుకు 40 నుండి 50 వెంట్రుకలు రాలుతాయి… కానీ , కొంత మందిలో వెంట్రుకలు రాలే ప్రక్రియ అధికంగా ఉండటం వలన బట్టతల కలుగుతుంటుంది. ముఖ్యంగా, ఇది పురుషులలో సహజమని చెప్పవచ్చు. పురుషులలో, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జుట్టు రాలుటకు చాలానే కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. పురుషులలో జుట్టు రాలుటకు గల ముఖ్య కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆరోగ్య సమస్యలు జుట్టు రాలటాన్ని ప్రభావిత ప్రేరేపిస్తాయి.

ఐరన్ లోపం

కొన్ని సందర్భాలలో ఐరన్ లోపం వలన కూడా పురుషులలో జుట్టు రాలుతుంది. అంతేకాకుండా, తినే ఆహరంలో కూడా ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటం వలన శరీరంలో ఐరన్ గ్రహింపబడక, కొరత ఏర్పడి వెంట్రుకలు రాలుట అధికం అవుతుంది. ఈ సమస్య ప్రయోగశాలలో త్వరగా గుర్తింపబడి, ఐరన్ సేకరణను అధికం చేయటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

అధిక మందుల వాడకం

పురుషులలో కొన్ని రకాల మందుల వాడకం వలన తాత్కాలికంగా వెంట్రుకలు రాలిపోతాయి. ఆర్థరైటిస్ (కీళ్ళ నొప్పులు), గుండె సమస్యలు, అధిక రక్త పీడనం, వంటి వ్యాధులకు మందులు వాడే మాత్రమె కాకుండా, ఎక్కువగా డిప్రెషన్’కు గురయ్యే వారు మరియు రక్తం పలుచగా ఉండే వారిలో జుట్టు త్వరగా రాలిపోతుంది. అంతేకాకుండా, అధిక మోతాదులో విటమిన్ ‘A’ సేకరణ వలన కూడా వెంట్రుకలు తెగిపోతుంటాయి.

థైరాయిడ్ గ్రంథి

శరీరంలో క్రియలను సరైన స్థాయిలో నిర్వహించే హార్మోన్’లు థైరాయిడ్ (అధివృక్క గ్రంధి) నుండి విడుదల అవుతాయి. కావున ఈ గ్రంధి విధి అధికమైన లేదా అల్పమైన వెంట్రుకలు రాలుపోతుంటాయి.