మీడియా "పవర్" పవన్ కి తెలిసొచ్చిందా ..?     2018-05-23   00:46:58  IST  Bhanu C

అందరూ అనడం కాదు కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే తన క్లారిటీ లేని చేష్టలతో రియల్ అజ్ఞానవాసి అని నిరూపించుకుంటున్నాడు. పవన్ లో ఆవేశం ఉంది కానీ సరైన ఆలోచనలు మాత్రం లేవని ఎప్పటి నుంచో ఆయన మీద వస్తున్న ఆరోపణలు. వాటికి బలం చేకూర్చేలా పవన్ వ్యవహారాలు చేస్తున్నాడు. దీనికి నిదర్శనమే పవన్ వర్సెస్ మీడియా. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చి అందరిని దడదడలాడించిన నటి శ్రీ రెడ్డి ఆ తరువాత ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టించింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ ఆ వివాదంలో చిక్కుకున్నాడు అది కాస్తా ముదిరి మీడియా వర్సెస్ పవన్ అనే స్థాయికి గొడవ ముదిరిన సంగతి తెలిసిందే. .

ఒక రాజకీయ పార్టీ స్థాపించి .. ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న రాజకీయ నాయకుడికి న్యూస్ ఛానెల్స్ తో ఎంత అవసరం ఉంటుందో ముందే తెలియదా ..? అవన్నీ మర్చిపోయి ఎవరో రెచ్చగొడితే రెచ్చి పోయి మీడియా మొత్తాన్ని ఉతికి ఆరేసి తాను ఎంత ధైర్యవంతుడినో నిరూపించుకోవాలనుకున్నాడు. అయితే వాస్తవం కొద్దిరోజులకే అర్ధం అయిపోయింది. జనాల్లో ఫోకస్ అవ్వాలంటే మీడియా అవసరం బాగా ఉందని తీరిగ్గా గుర్తించి నాలుక కరుచుకున్నాడు. అందుకే మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు.