మా దేశానికి రండి “భారతీయుల” కి “యూఏఈ” పిలుపు

అమెరికా భారతీయ టెకీ లపై పెట్టిన ఆంక్షలు..వీసాల విషయంలో పెడుతున్న నిభంధనలతో భారత ఎన్నారై ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది..దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఎంతో మంది భారతీయ ఎన్నారైలకి వివిధ దేశాలు సాదర స్వాగతం పలుకుతున్నాయి..ఈ జాబితాలో తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) వచ్చి చేరింది. కేవలం భారతీయులే కాదు, అసాధారణ ప్రతిభ ఉన్న ఏ దేశం వాళ్లయినా, పదేళ్ల పాటు తమ దేశంలో ఉండేలా వీసా మంజూరు చేసేలా యూఏఈ ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

వృత్తి నిపుణులు, విద్యార్థులు సైతం ఈ వీసాలకి అప్లై చేసుకోవచ్చాన్ని తెలిపింది..యూఏఈ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు..తాజా నిర్ణయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, ప్రతిభ కలిగిన వాళ్లకు యూఏఈ వేదిక అవుతుందని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది..‘‘అసాధారణ ప్రతిభ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మా దేశం మంచి వేదికగా మారుతుందని ప్రధాని మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అన్నారు. ఈ మేరకు ఉత్తర్వులను అమలు చేసేందుకు ఆర్థికమంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

తాజా అయితే ప్రధాని తీసుకున్న నిర్ణయంతో యూఏఈ అనేకమంది పెట్టుబడిదారులను కచ్చితంగా ఆకర్షిస్తుందని, అన్ని దేశాలతో పోటీ పడి గెలుస్తుందని అన్నారు అయితే ఈ సమయంలో ఎంతో ప్రతిభ కలిగిన భారతీయుల సప్పోర్ట్ కూడా ఉంటే తప్పకుండా విజయం సాధిస్తామని తెలిపారు..చదువుకోవాలనుకునే అసాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులు అయిదేళ్ల వీసా నివాస వీసాను ఇస్తామని తెలిపారు.