మార్కెట్ లోకి పతంజలి సిమ్ కార్డ్ లు .. సిమ్ తీసుకుంటే 5 లక్షల ఆఫర్..     2018-05-29   03:13:16  IST  Raghu V

యోగ గురువు బాబా రాందేవ్ ప‌తంజలి పేరుతో సంస్థ‌ను స్థాపించి దేశీయ ఉత్పత్తులు చేస్తూ మంచి బ్రాండ్ ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆయ‌న టెలికాం రంగంలోనూ అడుగుపెట్టేందుకు సిద్దం అయ్యారు.స్వ‌దేశీ స‌మృద్ధి సిమ్ కార్డులంటూ ప‌తంజ‌లి సిమ్ కార్డుల‌ను అట్ట‌హాసంగా లాంచ్ చేశాడు. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL)తో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి స్వదేశీ-సమ్‌రాధి సిమ్‌కార్డులను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి.

పతంజలి సిమ్


పతంజలి సంస్థ అందించే సిమ్‌కార్డుతో కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, 2జీబీ డేటా ప్యాక్‌తో పాటు 100ఎస్సెమ్మెస్‌లు కూడా పంపుకునే వీలుందని పేర్కొన్నారు.మొద‌ట‌గా ఈ సిమ్ కార్డుల‌ను పతంజలి సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులు మాత్రమే వాడ‌నున్నారు.ఆ త‌ర్వాత మ‌రికొద్దిరోజుల్లోనే అంద‌రికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కార్డు ఉపయోగించి వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని తెలిపారు..