మామూలు జ్వరం అనుకోకండి..భయంకరమైన వ్యాధి ఇది.! నిఫా వైరస్ 5 లక్షణాలు ఇవే.!     2018-05-22   00:28:10  IST  Raghu V

ఒకప్పుడు డెంగీ, తర్వాత స్వైన్ ఫ్లూ ఇలా ఎన్నో భయంకరమైన జబ్బుల గురించి మనం విన్నాము. కానీ ప్రస్తుతం అంతకంటే పెద్ద జబ్బు కేరళను వణికిస్తుంది. కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి తొమ్మిది మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో 25 మందిని ప్రత్యేక వార్డులో చికిత్స చేయిస్తున్నారు. నిఫా వైరస్ పై హెల్త్ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేరళ రాష్ట్ర ఆరోగ్య విభాగం అధికారులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. బాధితుల రక్త నమూనాలను పరీక్షల కోసం పుణేకి పంపించారు.

నిఫా వైరస్ పై కేంద్రం స్పందించింది. జాతీయ వ్యాధి నియంత్రణ బృందం కేరళ వెళ్లాల్సిందిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆదేశించారు. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి కాకుండా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ వ్యాధి నివారణ బృందం తీసుకోవాల్సిన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. పందులు, ఇతర జంతువుల ద్వారా ఈ వైరస్ వస్తుందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే ఈ వైరస్ కు ఇప్పటి వరకు మందు లేదు.

నిఫా వైరస్ లక్షణాలు ఇవే.!

1. ఈ వ్యాధి సోకిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. విపరీతమైన, భరించలేని తలనొప్పితో బాధపడుతుంటారు. తలపోటుకి ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు.