“మల్లాది” కి “మైండ్ బ్లాక్” అయ్యే ఆన్సర్ ఇచ్చిన “జగన్”..     2018-04-21   01:47:00  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా టూర్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది..ఆ నిర్ణయాలలో భాగంగా కొంతమంది సీనియర్స్ జగన్ నిర్ణయాలతో తెగ టెన్షన్ పడుతున్నారట..అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు అంటూ జగన్ పై లోలోపల తెగ మందిపడుతున్నారట..తమ అనుచరుల వద్ద తమ భాదని వెళ్లగక్కుతున్నారు అని తెలుస్తోంది..వైఎస్ బ్రతికున్న సమయంలో విజయవాడలో తన స్థానాన్ని ఎంతో సుస్థిరం చేసుకున్న ఆ నేత ఇప్పుడు తెగ ఆందోళన చెండుతున్నారట ఇంతకీ ఎవరా నేత అంటే మల్లాది విష్ణు అనే చెప్పాలి

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు… కాంగ్రెస్ నుంచి వీడి వైసీపీలో చేరిన తరువాత మళ్లీ అదే స్థానం నుండీ పోటీ చేయాలని భావిస్తున్నారు..అంతేకాదు ఈ విషయంలో జగన్ నుంచీ స్పష్టమైన హామీ కూడా తీసుకున్నారు…అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పరిణామాలు మారిపోవడంతో… మల్లాది విషయంలో జగన్ నిర్ణయం కూడా మారిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు…షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట…విజయవాడలోని మూడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేశారని తెలుస్తోంది..