“మలేసీయా” లో మంత్రిగా భారత “సిక్కు ఎన్నారై”    2018-05-23   00:49:37  IST  Bhanu C

మలేసియాలో భారత సంతతికి చెందిన ఒక సిక్కు ఎన్నారై రికార్డు సృష్టించాడు..మలేషియాలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎన్నారై మలేసియా ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచాడు..అయితే భారత సంతతి సిక్కు వ్యక్తి ఆ రికార్డు ని క్రియేట్ చేయడం అక్కడ సర్వత్రా చర్చనీయంసం అయ్యింది అంతేకాదు భారతీయలు అందరికీ గర్వకారణంగా నిలిచింది వివరాలలోకి వెళ్తే..

మలేసియా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఇండో- మలేసియా సిక్కు వ్యక్తిగా గోవింద్‌సింగ్‌ దేవ్‌ రికార్డులకి ఎక్కారు పక్కాటన్ హరప్పన్ సంకీర్ణ మంత్రివర్గంలో గోవింద్‌సింగ్‌ దేవ్ సమాచార, మల్టీమీడియా శాఖ మంత్రిగా నియమితులైయారు..అంతేకాదు ఆయనతో పాటు మరో భారత సంతతికి చెందిన ఎం.కిలసేగరన్‌ మానవ వనరులశాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు.