మరో బిజినెస్‌మన్‌ను బుట్టలో పడేసింది     2018-05-18   01:52:20  IST  Raghu V

ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయినా కూడా కొన్నాళ్లకు క్రేజ్‌ తగ్గి పోతుందనే విషయం అందరికి తెల్సిందే. ఈరోజు స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న వారు మరో మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అవకాశాలే లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు త్రిష పరిస్థితి అలాగే ఉంది. దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకున్న ముద్దుగుమ్మ త్రిష ఎట్టకేకు సినిమాలకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది.

త్రిష వివాహం గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో వచ్చిన పుకార్లతో ఒక పుస్తకమే వేయవచ్చు అంటే అతిశయోక్తి లేదేమో. ఎన్నో సార్లు అదుగో ఇదుగో త్రిష పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కొన్నాళ్ల క్రితం రాహుల్‌తో త్రిష వివాహ నిశ్చితార్థం అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆయన నుండి విడిపోయింది. సినిమాలకు దూరంగా ఉండాలనే కండీషన్‌ ఆయన పెట్టడం వల్లే త్రిష అతడినే వదిలేసినట్లుగా సమాచారం అందుతుంది. రాహుల్‌ నుండి విడిపోయాక ఒకటి రెండు సంవత్సరాలు సినిమాల్లో బిజీగా గడిపిన త్రిష ఈమద్య కాలంలో అవకాశాలు లేక ఢీలా పడిపోయింది.