మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఏ శుభకార్యం అయినా ఏ దైవ కార్యం అయిన కొబ్బరి కాయ లేనిదే జరగదు. మొదట కొబ్బరి కాయ కొట్టి ఏ కార్యాన్ని అయినా ప్రారంభించటం అనాదిగా ఒక ఆచారంగా వస్తుంది. దేవుడికి కొబ్బరి కాయ కొట్టి ఆ నీటితో అభిషేకం చేసి ఆ కొబ్బరి చెక్కలను నైవేద్యంగా పెడతారు. పూజలు,వ్రతాల సమయంలో కొబ్బరికాయను కొట్టి నివేదన చేస్తారు. భారతీయ పూజ విధానంలో కొబ్బరికాయకు ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది.

కొబ్బరికాయకు మూడు కనులు ఉండుట వలన ముక్కంటి కాయ అని కూడా అంటారు. కొబ్బరికాయను కొట్టినప్పుడు రెండు ముక్కలుగా అవుతుంది. ఈ రెండింటిని జీవుడు దేవుడికి ప్రతీకగా భావిస్తారు.