మన టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటారో చూడండి..     2018-05-29   06:55:52  IST  Raghu V

తెలుగు ప్రజలు సినిమా హీరోలని ఎంతగా అభిమానిస్తారో అందరికి తెలిసిందే , వారి అభిమాన నటుడి సినిమా అంటే ఆ ఆనందం వేరేలా ఉంటుంది.బాలీవుడ్ మార్కెట్ కి ధీటుగా తెలుగు సినిమాలకి కలెక్షన్స్ వస్తున్నాయి.బాహుబలి సినిమా తరువాత తెలుగు మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు సినిమాలు ఇతర భాషలకు తక్కువ అనువాదామవుతు ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది , ఇతర సినీ పరిశ్రమలు మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాయి..పైగా తెలుగు నుండి హిందీ లోకి డబ్ అవుతున్న సినిమాలకి యూట్యూబ్ లో మంచి వ్యాపారం అవుతుంది. ఒకప్పుడు 50 కోట్ల వసూళ్లు అంటే అదొక సంచలనం కానీ ఇప్పుడు విడుదలయిన మొదటి వారం లొనే 100 కోట్లకు పైగా కలెక్షన్ లు సాధిస్తున్నాయి.తెలుగు సినిమా మార్కెట్ కి తగ్గట్టుగానే తెలుగు నటులు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నిర్మాతలు కూడా ఆ హీరో యొక్క మార్కెట్ ని బట్టి ఇస్తున్నారు..ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో చూద్దాం..

మహేష్ బాబు

బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయి.. తండ్రి బాటలోనే హీరో అయ్యాడు మహేశ్‌బాబు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవల తన రెండు సినిమాలు (బ్రహ్మోత్సవం, స్పైడర్‌) పరాజయం పాలవ్వడం నిరాశ కలిగించిందని ఆయన ఓపెన్‌గానే చెప్పారు. ఆయన తాజా సినిమా ‘భరత్‌ అనే నేను’ మొదటిరోజు నుంచి సూపర్‌హిట్‌ టాక్ తెచ్చుకొని భారీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న హీరోల్లో మహేశ్‌బాబు ఒకరు. ఆయన సినిమాకు రూ. 18-20 కోట్ల వరకు తీసుకుంటారు.

జూనియర్ ఎన్టీఆర్

గడిచిన కొన్నాళ్లుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు వరుసగా సూపర్‌హిట్‌ అవుతున్నాయి. టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జైలవకుశ సినిమాలు ఆయనకు విజయాలు అందించాయి. ఇవి కమర్షియల్‌ సినిమాలు అయినప్పటికీ సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారాయన. ప్రస్తుతం ఆయన రూ. 18 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళితో సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్‌ తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు.