మజా మజా మొక్కజొన్న వర్షాకాలంలో ఎందుకు తినాలో తెలుసా?

సన్నని చినుకులు పడుతూ ఉన్న సమయంలో మొక్కజొన్న తింటే ఆ అనుభూతి వేరే…మాటల్లో వర్ణించలేము. మొక్కజొన్నలో ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ కూడా సమృద్ధిగా ఉంటాయి. మొక్కజొన్నకు కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్‌… వంటి పోషకాల శాతం మరింత పెరుగుతుంది. ఇన్ని పోషకాలు ఉన్న మొక్కజొన్న మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో చూద్దాం.

మొక్కజొన్నలో థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు సమృద్ధిగా ఉండుట వలన నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది.

మొక్కజొన్నలో పాంటోథెనిక్‌ ఆమ్లం,పీచు ఎక్కువగా ఉండుట వలన జీవక్రియకు దోహదపడుతుంది. దాంతో మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడటంలో సహాయపడుతుంది.

మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఐరన్ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇవి ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడతాయి.