మగ వ్యభిచారుల జీవితం ఇంత దారుణంగా ఉంటుందా

మీకు మోడరన్ ప్రపంచ జ్ఞానం ఉన్నట్లయితే మగ వ్యభిచారులు ఏమిటి, ఇలాంటివారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోరు. ఎందుకంటే వ్యభిచార వృత్తిలో మగవారు కూడా ఉంటారు. ఎలాగైతే ఆడ వ్యభిచారులని మగవారు బుక్ చేసుకుంటారో, అచ్చం అలానే మగ వ్యభిచారులను ఆడవారు కూడా బుక్ చేసుకుంటారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి లేదు. మగ వారు వ్యాభిచారంలోకి దిగినా ఏమిటి నష్టం, ఎలాగో గర్భం పొందే భయం ఉండదు, నొప్పి లాంటి ఇబ్బందులు ఉండవు, సుఖపడుతూ, ఒకరిని సుఖపెడుతూ, ఆ పనికే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనే అపోహలో మాత్రం ఉండకండి. మగ వ్యభిచారులకి కూడా కష్టాలు ఉంటాయి. వారి జీవితం కూడా దుర్భరంగా ఉంటుంది.

కండలు తిరిగిన దేహం లేని మగ దేహాన్ని కోరుకోవడం లేదు స్త్రీలు. అదే అమ్మాయి కొంచెం బరువు ఎక్కినా గుచ్చి గుచ్చి పట్టించుకోరు కాని, మగవారు ఖచ్చితంగా సరైనా షేపులో, కండలు తిరిగి ఉండాల్సిందే. ఇంకా ఇలాంటి డిమాండ్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒక మగ వ్యభిచారి మాటల్లోనే చదువుకుందామా? కాస్మోపాలిటన్ మ్యాగజీన్ వారు ఒక మగ వ్యభిచారి ద్వారా మగవారి దృష్టిలో వ్యభిచారం ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అతని పేరు బయటకి చెప్పడం వీలు కాదు కాని, అతని మాటల్లో ఆ సంగతులు కొన్ని తెలుసుకోండి.