భారత ఎన్నారైల కోసం “టీం ఎయిడ్ “     2018-06-06   01:46:32  IST  Bhanu C

దేశ విదేశాలలో ఎంతో మంది భారతీయులు ఉన్నారు ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో అత్యధికంగా ఉన్న ఎన్నారైలలో భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది..అయితే అక్కడ భారతీయులకి ఎటువంటి అవసరం వచ్చినా సరే వారికి చేయుత నివ్వాలి అంటే ఉద్దేశ్యంతో వారికి అండగా ఉండాలనే భావనతో ఏర్పాటు చేయబడుతున్నదే “టీం ఎయిడ్” అనే సంస్థ.. ఈ సంస్థని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుడు నన్నపనేని మోహన్ ప్రకటించారు.

అయితే ఈ సంస్థ గురించి అవగాహనా కార్యక్రమాలు “బే” ఏరియాలో ఏర్పాటు చేశారు..అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…లాభాపేక్షలేని ఈ సంస్థ పూర్తిగా స్వచ్ఛంద సేవకుల అంకితభావంతోనే నడుస్తున్నదనీ, తమ సేవలను అమెరికాలోని 50 రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావిస్తోన్నట్లు ఆయన తెలిపారు..ఈ కార్యక్రమంలో బే ఏరియాలోని వివిధ రాష్ట్రాలకి చెందినా ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిలికానాంధ్ర వైస్‌ ఛైర్మన​ దిలీప్‌ కొండిపర్తి మాట్లాడుతూ..