భారతీయ ఎన్నారైలు చైనా కంటే ముందున్నారు..అమెరికా     2018-05-10   02:55:23  IST  Bhanu C

ఏ దేశంలో అయినా సరే వలసవచిన వారిలో అధికశాతం మంది భారతీయులే ఉంటారు.అంతేకాదు వివిధ దేశాలు సైతం భారతీయులలో ఉండే ప్రతిభని గుర్తించి ఎక్కువగా వారికే ఉద్యోగ అవకాశాలు కల్పించేవి. .అయితే క్రమ క్రమంగా అన్ని దేశాలలో భారతీయుల సంఖ్య పెరుగుతూ వచ్చింది..అయితే అగ్రరాజ్యం అయిన అమెరికాలో అత్యధికంగా వలసలు వెళ్ళిన వారిలో అధికశాతం భారతీయులే ఉన్నారని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది…వివరాలలోకి వెళ్తే…

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఎన్నారై లకోసం హెచ్‌–1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కాయని…2016 లో 74.2%, 2017 లో 75.6 శాతం హెచ్‌–1బీ వీసాలు భారతీయులకే లభించాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది…అంతేకాదు ఈ సమయంలో కొత్తగా హెచ్‌–1బీ వీసాలు పొందిన భారతీయుల సంఖ్య తగ్గిందనీ..గతంలో వీసాలు పొందిన వారికి వీసా పొడిగింపులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.