బ‌ల‌నిరూప‌ణ‌కు ముందే యెడ్డీ రాజీనామా..?     2018-05-17   01:07:04  IST  Bhanu C

క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం న‌రాలు తెగే ఉత్కంఠ‌ను రేపుతోంది. క్ష‌ణంక్ష‌ణం రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన‌ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకోలేక‌పోయినా బీజేపీ శాస‌న స‌భ‌ప‌క్ష‌నేత య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌గ‌లిగారు. అయితే బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్‌వాలా ప‌దిహేను రోజుల గ‌డువు ఇచ్చారు. అయితే అనూహ్యంగా బ‌ల‌నిరూప‌ణ‌కు ముందే య‌డ్యూర‌ప్ప రాజీనామా చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రో ఏడాదిలో పార్ల‌మెంటు ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రోవైపు కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు లాక్కోవ‌డం అంత‌సులువు కాద‌నీ, ఒక‌వేళ అలాచేస్తే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నీ, అది సాధార‌ణ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని క‌మ‌లం నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రోవైపు గ‌తంలో క‌ర్ణాట‌క‌లో, దేశ‌రాజ‌కీయాల్లో జ‌రిగిన ప‌లు కీల‌క ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే బీజేపీకి రెండుమూడు ఆప్ష‌న్లు క‌నిపిస్తున్నాయి. 2008లో కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో బీజేపీకి మూడు సీట్లు తక్కువ వచ్చాయి. అప్పుడు జేడీఎస్‌కు చెందిన నలుగురిని, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయించారు. దీంతో సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన సంఖ్య తగ్గిపోయింది.