బ్రేక్ అప్ తరువాత బాధ తగ్గాలంటే ఈ 5 పనులు చేయండి

ఎయిడ్స్ కి కూడా చికిత్స దొరుకుతుందేమో కాని లవ్ ఫెల్యూర్ కి మాత్రం చికిత్స దొరకదు. ఆలోచనలు కమ్మేస్తాయి, జ్ఞాపకాలు దహింపజేస్తాయి, సూటిగా చెప్పాలంటే మనిషి బుర్రలో పురుగులా తిరుగుతూ, ఇటు మానసికంగా హింసిస్తూ, మనల్ని మనం శారీరకంగా హింసించుకునేలా చేస్తాయి. ఇలాంటి కోణంలో వచ్చిన అర్జున్ రెడ్డి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణం, అలాంటి జీవితాలు ఎన్నో నిజ జీవితంలోనూ ఉండటం. అమ్మాయిలు, అబ్బాయలు తేడా లేకుండా ఆ బాధకి, ఆ నొప్పికి కనెక్ట్ అవడం. కాని లవ్ లో ఫెయిల్ అయితే, లైఫ్ లో ఫెయిల్ అవ్వాలని కాదు కదా. బ్రేక్ అప్ నుంచి కోప్ అప్ కష్టమైన విషయమే కాని, జీవితం ముందుకి సాగాలంటే తప్పదు. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని ఖచ్చితంగా మరచిపోవాలనే ఫిక్స్ అయితే, వారి ప్రవర్తన మిమ్మల్ని ఏడిపించి ఉంటే, మీరు వారి ద్వేషాని కన్నా ఎత్తులో నిలవాలంటే, ఈ టిప్స్ పాటించండి.

* మొదట ఆమె/అతడు మీకు ఇచ్చిన జ్ఞాపకాలు తుడిచివేయాలి. ఫోటోలు డిలీట్ చేయాలి, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టిన కబుర్లు, అన్ని డిలీట్ చేయాలి. అవి అలానే ఉంటే మాటిమాటికి వాటినే చూస్తూ బాధపడాల్సి ఉంటుంది. అందుకే అవి కంటికి కనిపించకుండా డిలీట్ చేయడం ఉత్తమం.

* నెగెటివ్ పాయింట్స్ ని మీ మెదడులో హైలెట్ చేసుకోండి‌. మీ బ్రేకప్ కి కారణం ఏంటో, అందులో అతడు/ఆమె చేసిన తప్పులేంటో, వాటి వలన మీరు ఎలా బాధపడ్డారో తెచ్చుకోండి. ఆమెని/అతడిని మర్చిపోవడానికి సరైన కారణాలపై బాగా స్ట్రెస్ చేయండి.