బ్యూటీ పార్లోర్ లో ఆ మాయ లేడి ఏం చేస్తుందో తెలుస్తే షాక్..! పట్టిస్తే భారీ బహుమతి     2018-06-01   01:10:47  IST  Raghu V

ఓ మహిళా దొంగ కోసం రూ.25 వేల నజరానాను ప్రకటించారు హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులు. కొన్ని రోజులుగా KPHB ప్రాంతాల్లోని బ్యూటీ పార్లర్లలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ఆరా తీసిన పోలీసులు.. CCTV పుటేజీ ఆధారంగా ఓ మాయలేడీ ఈ దొంగతనాలను చేస్తున్నట్లు గుర్తించారు. బ్యూటీ పార్లర్ లో మేకప్ కోసమని వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. అనుమానాస్పద మహళలతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.