బీజేపి గ్రాఫ్ డౌన్..ఆలోచనలో పవన్..మంత్రి షాకింగ్ కామెంట్స్  

పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారా..? బీజేపి గ్రాఫ్ పడిపోవడమే అందుకు కారణమా..? ఇప్పుడు పవన్ రూటు ఎటు..? ఇప్పుడు ఈ ప్రశ్నలు పవన్ అభిమానులని ఏపీ ప్రజలని వేదిస్తున్నాయి..ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు సాక్షాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప..పవన్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది అనేట్టుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకుంటారా అనే విషయాలని కాసేపు పక్కకి పెడితే..

ఆదివారం మీడియాతో చినరాజప్ప మాట్లాడారు ఈ సందర్భంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు సైతం చేయడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.. నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న తేడాను కూడా ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అయితే నిర్ణయాన్ని తొందరగా తీసుకుంటారని, చంద్రబాబు అయితే ఆలోచిస్తారని చెప్పారు. అందరూ మన మనుషులే, మనతో ఉన్నారు.. నచ్చ చెప్పాలని చంద్రబాబు చూస్తారని వ్యాఖ్యానించారు.