బిగ్ బాస్ సీజన్ 2 లో ఇన్ని దారుణాలా.? మీరు ఇవి గమనించారా.?     2018-06-23   02:26:45  IST  Raghu V

బిగ్ బాస్ సెకండ్ సీజన్ స్టార్టయి రోజులు గడుస్తున్నా సరైన మసాలా పడలేదని భావిస్తున్న ఆడియన్స్ కు సిసలైన విందు భోజనం రెడీ అయింది. ఇప్పటివరకు బిగ్ బాస్-2 నడిచింది ఒకెత్తు… ఇకపై నడిచేది మరో ఎత్తు అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కత్తులు నూరుతున్నారు. తొలిరోజు నుంచి మొదటి వారం కంప్లీట్ అయ్యేవారకు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన నూతన్ నాయుడు, గణేష్ ఏంమాట్లాడితే ఏం తంటా వస్తుందో అన్నట్టుగా సెలబ్రిటీల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. కానీ ఆడపిల్ల అయినా సంజన మాత్రం ఎక్కడా వెనక్కితగ్గకుండా దూకుడు ప్రదర్శించింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది. ఇప్పుడు హౌస్ లో ఉన్న మిగిలిన కామన్ పీపుల్ లో నూతన్ నాయుడు, గణేష్ మిగిలారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ లో తనీష్ కుట్రలు చేస్తున్నాడనే విషయం వైరల్ అవుతుందిఇంటిలోకి వచ్చినప్పటి నుంచి అందరిని తన చెప్పుచేతల్లో పెట్టుకోవటానికి ప్లాన్స్ వేస్తూనే ఉన్నాడు. హౌస్ లో బాగా యాక్టివ్ గా ఉండే తేజస్వితో జత కట్టి సామ్రాట్ ని చేరదీసి ఇంటి మొత్తాన్ని తన ఆధీనంలోకి వచ్చేటట్టు చేసుకున్నాడు. అంతేకాక కెప్టెన్ టాస్క్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భాను శ్రీని కాదని తన మాట వినే సామ్రాట్ గెలిచేలా అందర్నీ ఒప్పించాడు. కెప్టెన్ అయిన సామ్రాట్ కూడా ప్రతి విషయాన్నీ తనీష్ కి చెప్పి సలహా తీసుకుని మరీ చేస్తున్నాడు.