బాలయ్య – పూరిల మీద సీనియర్ నటి ఘాటు విమర్శలు

తరుచుగా వివదాస్పద అంశాలతో వార్తల్లో ఉంటూ వస్తున్న నందమూరి బాలకృష్ణ, ఈమధ్య మరోసరి మరో వివాదాస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కిన సంగతి విదితమే. ఉపఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్ళిన బాలయ్య బాబు, అక్కడ దండ వేయడానికి వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకున్న విడియో మీరు చూసే ఉంటారు. ఈ సంఘటన జరగటానికి రెండు వారాల ముందే తన అసిస్టెంట్ చెప్పులు తీయలేదని అతనిపై కూడా చేయి చేసుకున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ ప్రవర్తనపై నేషనల్ మీడియా కూడా స్పెషల్ ఎపిసోడ్స్ ప్రచారం చేసింది. ఇందంతా ఒక ఎత్తు అయితే, మొన్న పైసా వసూల్ ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ బాలకృష్ణని సమర్థిస్తూ, బాలకృష్ణకి అభిమాననులకి మద్య ఓ లవ్ స్టోరి ఉంది, ఆయన కొట్టినా తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ మాట్లాడటం మరొక ఎత్తు.

పూరి జగన్నాథ్ వ్యాఖ్యలపై, బాలకృష్ణ పధ్ధతిపై టాలివుడ్ మొత్తం సైలంట్ గా ఉన్నా, సోషల్ మీడియా మాత్రం సైలెంట్ గా ఉండట్లేదు. ఆ విమర్శనాస్త్రాల నడుమ సీనియర్ నటి కస్తూరి కూడా ఘాటైన విమర్శలు వదిలింది.