బాబోరి నిరుద్యోగ ప్రకటనలో అసలు ట్విస్ట్ ఇదీ     2018-06-01   01:58:01  IST  Bhanu C

చంద్రబాబు నాయుడు ప్రకటించిన నిరుద్యోగ ప్రకటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..యువత అందరూ చంద్రబాబుకి జై కొడుతున్నారు..ఎన్నికల హామీ అమలు చేసినందుకు గాను ఏపీ యువత మొత్తం చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపుతున్నారు అంటూ టీడీపి నేతలు తెగ డప్పులు కొట్టుకుంటున్నారని వైసీపి వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు అసలు హామీ ఇచ్చింది చివరిలో యువత ఓట్ల కి గేలం వేయడం కోసమా అయితే ఎన్నికల మొదటి సంవత్సరం నుంచీ ఆ మొత్తాన్ని అమలు చేసే దమ్ము ఉందా అంటూ వైసీపి వాళ్ళు టీడీపీ కి సవాల్ విసురుతున్నారు..అసలు వివరాలలోకి వెళ్తే..

ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తాను నిరుద్యోగులకి ఇచ్చిన హామీని ఎట్టకేలకి ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు..రాష్ట్రంలో యువత మొత్తం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఏమి చేయలేక పోయింది అనుకున్న సమయంలో యువత అంతా తీవ్రమైన అసంతృప్తిగా ఉన్న తరుణంలో చంద్రబాబు వేసిన ఈ స్కెచ్ యువత ని తనవైపు తిప్పుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు..అయితే చంద్రబాబు ప్రకటించిన ఈ బృతి పొందటానికి కనీస విద్యార్హత డిగ్రీ గా నిర్ధారించారు…దాదాపు ఈ సాయం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు