బాబు స్పీడుకి బ్రేకేసే మరో ఆడియో టేపు..     2018-06-04   05:02:44  IST  Bhanu C

మూలిగే నక్కమీద తాటికాయ పడటం అంటే ఏంటో తెలుసు కదా ఇప్పుడు అదే పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబు కి ఎదురవుతోంది.. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా లేదనుకుంటుంటున్న తరుణంలో ఓటుకు నోటు కేసు చంద్రబాబు జీవితములో మాయని మచ్చని మిగిల్చింది..చంద్రబాబు ని వేలెత్తి చూపించలేని వారు సైతం ఇప్పుడు చంద్రబాబు వైపు చూడటమే కాదు చూసి అపహాస్యం చేసుకునే పరిస్థితికి తెచ్చింది ఓటుకు నోటు కేసు..అయితే

ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మరో ఆడియో టేప్ తలనొప్పిగా మారింది…తాజాగా బయటపడిన ఒక వాయిస్ టేపు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది..ఆ ఆడియో టేపులో ఏముందంటే.. చంద్రబాబు నాయుడితో “నైస్” గా ఉంటే ఏపీలో ఏ పనైన చాలా సులువుగా అయిపోతుందని ఉంది ఇది మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా టాప్ అధికారులు మాట్లాడుకుంటున్న ఆడియో టేప్ ఒకటి సీబీఐకి చేతికి చిక్కడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది..